కరోనాతో ప్రాణాలు కోల్పోయిన 69 మంది ఆరోగ్య కార్యకర్తలు

కరోనాతో ప్రాణాలు కోల్పోయిన 69 మంది ఆరోగ్య కార్యకర్తలు

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్ని భయపెడుతోంది. కరోనా విజృంభణ ధాటికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు లక్ష 77 వేలకు పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 25 లక్షలు దాటాయి. అత్యంత ప్రమాదకర కరోనా మహమ్మారి బ్రిటన్ పై కూడా పంజా విసిరింది. ప్రస్తుతం అక్కడ లక్ష 20 వేలు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 16 వేలు దాటింది. దేశంలో కరోనా విపరీతంగా విజృంభించటంతో.. రోజూ వేల మందికి కొత్తగా వైరస్‌ సోకుతోంది. అయితే వీరికి వైద్యసేవలు అందిస్తూ విధి నిర్వహణలో 69 మంది వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డొమినిక్‌ రాబ్‌ బుధవారం ప్రకటించింది. వీరంతా నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌కు సేవలు అందిస్తున్నారని వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story