ఇకపై క్వారంటైన్ 14 రోజులు కాదు.. 28 రోజులు

ఇకపై క్వారంటైన్ 14 రోజులు కాదు.. 28 రోజులు

కరోనాను కట్టడి చేయాలంటే అనుమానితుల్ని, పాజిటివ్ కేసుల్ని క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. 14 రోజుల తరువాత పరీక్షలు జరిపి కోవిడ్ లక్షణాలేవీ లేవని నిర్ధారించుకున్న తరువాతే ఇళ్లకు పంపిస్తున్నారు. కానీ ఇకపై హోం క్వారంటైన్ గడువును 28 రోజులకు పొడిగిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. 14 రోజుల అనంతరం కూడా పాజిటివ్ ఫలితాలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దాంతో పాటు వైరస్ బాధితుడితో ప్రైమరీ కాంటాక్ట్ వున్న వ్యక్తికి పరీక్షలు చేయాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. సెకండరీ కాంటాక్ట్‌ను టెస్ట్ చేయొద్దని వారిని హోం క్వారంటైన్‌లో ఉంచితే సరిపోతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ఒడిశఆ, కేరళ, అస్సాం, జార్ఖ్ండ్ రాష్ట్రాలు హోం క్వారంటైన్ కాలాన్ని 28 రోజులకు పెంచాయి.

Tags

Read MoreRead Less
Next Story