మద్యాన్ని విక్రయిస్తే వారి లైసెన్సు రద్దు చేస్తాం: ఢిల్లీ సర్కార్

మద్యాన్ని విక్రయిస్తే వారి లైసెన్సు రద్దు చేస్తాం: ఢిల్లీ సర్కార్
X

లాక్‌డౌన్ సందర్భంగా మద్యాన్ని ఎవరు విక్రయించినా వారిపై కఠినచర్యలు తప్పవని ఢిల్లీ సర్కారు స్పష్టం చేసింది. మద్యం లైసెన్సులు ఉన్నవారు మద్యాన్ని విక్రయిస్తే వారి లైసెన్సు రద్దు చేసి వారిని బ్లాక్ లిస్టులో పెడతామని ఢిల్లీ ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది.

కొన్ని స్టోర్లు, క్లబ్ లు, రెస్టారెంట్లలో మద్యం విక్రయిస్తున్నట్టు తమకి సమాచారమందిందని.. ఇప్పటికే వారిపై నిఘా పెట్టామని ఢిల్లీ ఎక్సైజ్ అధికారులు చెప్పారు. లాక్ డౌన్ సమయంలో మద్యం విక్రయిస్తున్న 14 మందిని అరెస్టు చేసి, 8,400 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ అధికారులు చెప్పారు.

Next Story

RELATED STORIES