మహారాష్ట్రలో ప్రతిరోజూ 13% మంది రోగుల డిశ్చార్జ్ : ఆరోగ్య శాఖ మంత్రి

మహారాష్ట్రలో ప్రతిరోజూ 13% మంది రోగుల డిశ్చార్జ్ : ఆరోగ్య శాఖ మంత్రి
X

మహారాష్ట్రలో పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల మధ్య, కొన్ని శుభవార్తలు కూడా వస్తున్నాయి. మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల రెట్టింపు రేటు ఇప్పుడు 7.01 రోజులకు పడిపోయిందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే అన్నారు. అలాగే మహారాష్ట్రలో కరోనావైరస్ హాట్‌స్పాట్‌లు కూడా తగ్గాయని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో నిన్నమొన్నటివరకూ 14 హాట్‌స్పాట్‌లు ఉంటే.. ఇప్పుడు 5 మాత్రమే ఉన్నాయి, అవి ముంబై, ఎంఎంఆర్, నాగ్‌పూర్, పూణే , మాలెగావ్ లో ఉన్నాయని చెప్పారు.

అంతేకాదు ప్రతిరోజూ 13% మంది రోగులు డిశ్చార్జ్ అవుతున్నారు అని చెప్పారు. ఇక కరోనాను ఎదుర్కోవడానికి రాష్ట్రం పూర్తిగా సిద్ధమైందని చెప్పిన మంత్రి .. రాష్ట్రంలో 1,55,000 ఐసోలేషన్ పడకలు ఉన్నాయని, రోజుకు 7,000 పరీక్షల పరీక్ష సామర్థ్యంతో దేశంలో అగ్రస్థానంలో ఉందని చెప్పారు. కాగా మహారాష్ట్రలో మొత్తం కరోనావైరస్ పాజిటివ్ కేసులు 5,649 గా ఉన్నాయి.. అత్యధికంగా ముంబైలో 3,683 పాజిటివ్ కేసులు ఉన్నాయి.

Next Story

RELATED STORIES