బీ కేర్‌ఫుల్.. కరోనా ఇంకొంత కాలం మనతోనే.. : డబ్ల్యుహెచ్‌వో

బీ కేర్‌ఫుల్.. కరోనా ఇంకొంత కాలం మనతోనే.. : డబ్ల్యుహెచ్‌వో

కల్లో కూడా కరోనానే కనిపిస్తుంది. అప్పుడే ఏం చూశారు.. ముందు ముందు చూపిస్తా నా తడాఖా ఏంటో అని అన్నట్లే ఉంది.. ఈ వైరస్ గురించి డబ్ల్యుహెచ్‌వో చేస్తున్న హెచ్చరికలు చూస్తుంటే. కొన్ని దేశాలు కరోనాని కట్టడి చేశామని కాలరెగరేస్తున్నాయి.. అది అంత మంచిది కాదు. వైరస్ మన మధ్యలోనే ఉంది మళ్లీ వస్తుంది. లాక్డౌ‌న్లు ఎత్తి వేసి తప్పు చేయొద్దు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అధోనామ్ వెల్లడించారు. మహమ్మారిని ఎదుర్కోవడంలో చాలా దేశాలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని, రానున్న కాలంలో ఆఫ్రికా, అమెరికా వంటి దేశాల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సంస్థ అంచనా వేస్తోంది. ప్రస్తుతం పశ్చిమ ఐరోపా దేశాల్లో వైరస్ తీవ్రత కాస్త తగ్గినట్లు అనిపించినప్పటికీ.. ఆఫ్రికా, మధ్య, దక్షిణ అమెరికాతో పాటు తూర్పు ఐరోపా దేశాల్లో వైరస్ తీవ్రత పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మొదట్లో వ్యాధి తీవ్రత తగ్గిందని భావించిన దేశాల్లో మళ్లీ పాజిటివ్ కేసులు వెలుగు చూడడం ఇందుకు నిదర్శనమన్నారు. కరోనా వైరస్‌ని గురించిన హెచ్చరికలు (జనవరి30న) డబ్ల్యుహెచ్‌వో ముందే చేసి అంతర్జాతీయ అత్యయిక స్థితి ప్రకటించిందని టెడ్రోస్ వెల్లడించారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడిన కేసులు 26 లక్షలు కాగా, ఇప్పటి వరకు లక్షా 80 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags

Read MoreRead Less
Next Story