27న సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్!‌

27న సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్!‌
X

దేశంలో కరోనావైరస్ తాజా పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని మోదీ 27న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.. ఈ విషయాన్నీ ప్రధాని కార్యాలయ వర్గాలు తెలిపాయి.అన్ని రాష్ట్రాల సీఎంలతో మోదీ ఇప్పటికే 2 సార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఏప్రిల్ 2, ఏప్రిల్ 11న ముఖ్యమంత్రులతో మాట్లాడిన మోదీ లాక్ డౌన్ పై వివిధ రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకున్నారు.

ఈ సారి కూడా లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించాలా? వద్దా? అనే దానిపైనా రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తీసుకునే అవకాశముంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్‌లతో ప్రధాని ఈ నెల 24వ తేదీన వీడియో లింక్‌ ద్వారా మాట్లాడనున్నారు.

Next Story

RELATED STORIES