క్వారంటైన్‌లో ఖాళీగా ఎందుకు.. ఆశ్రయమిచ్చిన వారికి కృతజ్ఞతగా..

క్వారంటైన్‌లో ఖాళీగా ఎందుకు.. ఆశ్రయమిచ్చిన వారికి కృతజ్ఞతగా..
X

సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు ఏ రూపంలో అయినా చెప్పొచ్చు. లాక్డౌన్ కారణంగా ఊరికి వెళ్లలేని వలసకార్మికులు ఓ బడిలో బందీ అయ్యారు. కరోనా నేపథ్యంలో రాజస్థాన్ సికర్ జిల్లా పల్సానా గ్రామంలోని పాఠశాలలో కార్మికులందరినీ క్వారంటైన్‌లో ఉంచారు అధికారులు. వీరిలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్ ఇలా పలు రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఉన్నారు వీరిలో. గ్రామస్థులు వీరికి రెండు పూటలా భోజనం పంపించే వారు. వారి ఆతిధ్యం కార్మికులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఆశ్రయమిచ్చిన పాఠశాలకు, ఆతిధ్యం ఇచ్చిన ఊరికి ఏదో ఒకటి చేసి తమ కృతజ్ఞత తెలియజేయాలనుకున్నారు కార్మికులు. వాళ్లంత కలసి స్కూల్‌కి సున్నం వేసి స్కూల్ పరిసరాలను శుభ్రం చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా తమ మనసులోని మాటను అధికారులకు వివరించారు. గ్రామ సర్పంచ్ జోక్యంతో పెయింటింగ్‌కు కావలసిన వస్తువులు తెప్పించి కార్మికులకు ఇచ్చారు.

కార్మికులు క్వారంటైన్ పూర్తయ్యేనాటికి స్కూల్ భవనానికి రంగులు వేశారు. గ్రామ సర్పంచ్ వారు చేసిన పనికి గాను డబ్బులు ఇవ్వబోతే తీసుకోలేదు. స్కూల్ అవసరాలకే ఆ డబ్బుని వినియోగించమని చెప్పారు. స్కూల్‌కి పెయింటింగ్ చేసి తొమ్మిదేళ్లయిందని.. ఇప్పుడు రంగులు వేసి పాఠశాలకు కొత్త కళను తీసుకు వచ్చారని కార్మికులను గ్రామస్తులు అభినందిస్తున్నారు.

Next Story

RELATED STORIES