Coronavirus: త్వరలో చైనా నుండి 20 విమానాల ద్వారా వైద్య సామాగ్రి..

Coronavirus:  త్వరలో చైనా నుండి 20 విమానాల ద్వారా వైద్య సామాగ్రి..

చైనా నుండి ఇండియాకు తెప్పించిన ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ కిట్ల ద్వారా ఫలితాలు సరిగా రాకపోయినప్పటికీ, చైనా నుండి వైద్య సామాగ్రిని దిగుమతి చేసుకోవడం ఆపకూడదని భారత ప్రభుత్వం నిర్ణయించింది. రాబోయే రోజులలో 20 విమానాలు ద్వారా చైనా నుండి వైద్య సామాగ్రి భారత్ కు వస్తుందని గురువారం విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ విషయాన్నీ విదేశీవ్యవహారాల శాఖ ప్రతినిధి, అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు.

రెండు వారాల్లో చైనాలోని ఐదు నగరాల నుండి 24 విమానాల ద్వారా ఆర్టి-పిసిఆర్ పరీక్షా వస్తు సామగ్రితో సహా దాదాపు 400 టన్నుల వైద్య సామాగ్రి వచ్చిందని. ఇందులో యాంటీబాడీ పరీక్షల కిట్ లు, పిపిఇ కిట్లు, థర్మామీటర్లు మొదలైనవి కూడా ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో కూడా దిగుమతి ఉంటుందని.. మరో 20 విమానాలు చైనా నుండి వైద్య సామాగ్రి వస్తుందని ఆయన అన్నారు. కాగా చైనా నుంచి తెప్పించిన ర్యాపిడ్ కిట్ ల ఫలితాల రేట్ తక్కువగా ఉందన్న కారణంగా ICMR రెండు రోజులపాటు వీటిద్వారా జరిపే టెస్ట్ లను నిలిపివేయమని ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇదిలావుంటే ఇప్పటివరకు, చైనా, దక్షిణ కొరియా , సింగపూర్‌లోని సంస్థల నుండి 37 లక్షల యాంటీబాడీ టెస్టింగ్ కిట్‌ల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇప్పటివరకు కేవలం 7 లక్షల కిట్లు మాత్రమే భారతదేశానికి చేరుకున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story