భారత పౌరులను కూడా చూసుకుంటాం : సింగపూర్ ప్రధాని హామీ

భారత పౌరులను కూడా చూసుకుంటాం : సింగపూర్ ప్రధాని హామీ

కరోనావైరస్ మహమ్మారి తో బాధపడుతున్న ఇతర సింగపూర్ వాసుల మాదిరిగానే.. సింగపూర్‌లో పనిచేస్తున్న భారతీయ పౌరులను కూడా చూసుకుంటామని సింగపూర్ ప్రధాని లీ హ్సేన్ లూంగ్ గురువారం ప్రధాని నరేంద్ర మోడీకి హామీ ఇచ్చారు. సింగపూర్, భారతదేశంలో కొనసాగుతున్న మహమ్మారి పరిస్థితి గురించి తాను ప్రధాని మోడీతో టెలిఫోన్ చర్చలు జరిపినట్లు లీ గురువారం ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. వలస కార్మికులు ఇక్కడ పనిచేసేందుకు గాను వ్యక్తిగత త్యాగాలు చేశారు.

వారు సింగపూర్‌కు ఎంతో కృషి చేశారు, కాబట్టి వారిని కూడా కాపాడే బాధ్యత మాకు ఉంది. అని పేర్కొన్నారు. కాగా భారత్ లో ఉన్న సింగపూర్ వాసులను తరలించడంలో భారతదేశం చేసిన సహాయం మరువలేనిదని.. ఈ విషయంలో ఆయన ప్రధాని మోదికి కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశంలో కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా ఇర్రుక్కుపోయిన 699 మంది సింగపూర్ పౌరులను ఆ దేశానికీ చేర్చింది భారత్.

Tags

Read MoreRead Less
Next Story