కరోనా సోకిన పార్టీ మహిళా నాయకురాలు.. క్వారంటైన్‌లో వివాహ వార్షికోత్సవ వేడుకలు

కరోనా సోకిన పార్టీ మహిళా నాయకురాలు.. క్వారంటైన్‌లో వివాహ వార్షికోత్సవ వేడుకలు

పేరుకి మాత్రం నాయకులు.. ఏం చేసినా చెల్లుతుందన్న ధీమా. ఓ పక్క కరోనాతో జనం ఛస్తుంటే కొంచెమైనా బాధ్యత లేకుండా ప్రవర్తించారు ఉత్తర ప్రదేశ్ బులంద్ షహర్‌కు చెందిన అధికార పార్టీ మహిళా నాయకురాలు. ఆమెను కలవడానికని ఢిల్లీ నుంచి ఓ ఆయుర్వేద వైద్యుడు వచ్చారు. ఢిల్లీ నుంచి వచ్చారు కదా అని ఆయనకు టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటు ఈమెకు కరోనా సోకింది. దాంతో నాయకురాలి కుటుంబసభ్యులందరినీ శిఖర్‌పూర్‌లోని క్వారంటైన్‌కు తరలించారు అధికారులు.

సరే.. అక్కడైనా తిన్నగా ఉన్నారా అంటే అదీ లేదు.. ఆమె తన 38వ వివాహ వార్షికోత్సవ వేడుకలను క్వారంటైన్‌లో అట్టహాసంగా జరుపుకుంది. హాలిడే స్పాట్‌కు వెళ్లినంత ఆనందంగా వేడుకలు నిర్వహించారు. భర్త, కూతురు, అల్లుడి మధ్య కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ పార్టీ చేసుకున్నారు. పైగా వీటన్నింటినీ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లాక్డౌన్ నిబంధనలను తుంగలో తొక్కి వేడుకలు జరిపిన సదరు నాయకురాలిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. క్వారంటైన్‌ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై కూడా యాక్షన్ తీసుకోనున్నారు. కొసమెరుపు ఏంటంటే మహిళా నాయకురాలితో పాటు ఆమె భర్తకి కరోనా పాజిటివ్ అని తేలింది.

Tags

Read MoreRead Less
Next Story