అమ్మ క్యాంటీన్లలో ఉచితంగా ఆహారం

అమ్మ క్యాంటీన్లలో ఉచితంగా ఆహారం

గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ చెన్నై వాసులకు తీపి కబురును అందించింది. లాక్‌డౌన్ ముగిసే వరకు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలో ఉన్న అమ్మ క్యాంటీన్లలో ఉచితంగా ఆహారం అందిస్తామని ప్రకటించింది. ఇప్పుడు చాలాచోట్ల వైరస్ కంటే ఆకలే అతిపెద్ద సమస్యగా మారిందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. నగరంలోని అందరికీ దీన్ని అందుబాటులో ఉంచాలని నిర్ణయించామన్నారు.

చెన్నైలో మొత్తం 407 అమ్మ క్యాంటీన్లు ఉన్నాయని.. వీటి నిర్వహణ కోసం రోజుకు రూ.17 లక్షలు ఖర్చు అవుతోందని తెలిపారు. అయితే మే 3 వరకు ఉచిత ఆహారం అందించేందుకు సరిపడా నిధులు ఉన్నాయని అన్నారు. ఎన్జీవోలు, స్వతంత్ర దాతలు, కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతల నిధులతో క్యాంటీన్లను నిర్వహిస్తున్నామనీ.. ఆసక్తిగల దాతలెవరైనా ఈ కార్యక్రమానికి విరాళాలు ఇవ్వచ్చునని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story