coronavirus : భారత్ లో 19.89 శాతానికి పెరిగిన రికవరీ రేటు

coronavirus : భారత్ లో 19.89 శాతానికి పెరిగిన రికవరీ రేటు

దేశంలో కరోనావైరస్ మహమ్మారి ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది.. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 21 వేలకు పైగా పెరిగింది. అయితే ఇందులో కాస్త ఉపశమనం కలిగించే విషయం ఏదైనా ఉంది అంటే రికవరీ రేటు ఎక్కువగా నమోదు కావడమే.. ప్రస్తుతం 4,257 మందికి పైగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖా స్పష్టం చేసింది. ప్రస్తుతం 16,454 మందికి చికిత్స కొనసాగుతోంది. అయితే భారతదేశంలో రికవరీ రేటు 19.89 శాతానికి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. అన్ని రాష్ట్రాల్లో మొత్తం 4,257 మందికి పైగా డిశ్చార్జ్ కాగా అత్యధికంగా మహారాష్ట్రలో 789 మందికి పైగా కోలుకున్నారు.

ఆ తరువాత ఢిల్లీలో 727 , తమిళనాడు 662, ఇక కేరళలో సంతోషకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ మొత్తం 438 కేసులు నమోదు కాగా అందులో 323 మంది కోలుకున్నారు, అంతేకాదు ఇక్కడ కేవలం మూడు మరణాలు మాత్రమే సంభవించాయి. ఆ తరువాత రాజస్థాన్ లో 230 , తెలంగాణలో 194 , గుజరాత్ 179 , ఉత్తరప్రదేశ్ 173 , మధ్యప్రదేశ్ 148 , హర్యానా 140 , కర్ణాటక 131 , ఆంధ్రప్రదేశ్ 120 , జమ్మూ కాశ్మీర్ 92 , పశ్చిమబెంగాల్ 79 , పంజాబ్ 49 , బీహార్ 46 , ఒడిశా 32 , ఛత్తీస్ ఘడ్ 26 , ఉత్తరాఖండ్ 23 , అస్సాం 19 , హిమాచల్ ప్రదేశ్ 18 , చండీగర్, లడక్ 14 , అండమాన్ నికోబార్ దీవులు 11 , జార్ఖండ్ 8 , గోవా 7 ఇక మిగిలిన ప్రాంతాల్లో ఒకటి రెండు రికవరీలు నమోదయ్యాయి. కాగా గురువారం, రాజస్థాన్‌లో 33, పశ్చిమ బెంగాల్‌లో 33, కర్ణాటకలో 16, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 3 అలాగే మిగిలిన చోట్ల ఒక్కో రికవరీ నమోదు అయింది.

Tags

Read MoreRead Less
Next Story