కరోనా కొత్త లక్షణం.. కాలి బొటన వేలు..

కరోనా కొత్త లక్షణం.. కాలి బొటన వేలు..

ఆగకుండా దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వస్తుంటే కరోనా వచ్చిందేమో అని ఆందోళన చెందడం.. టెస్ట్ చేస్తే పాజిటివ్ రావడం జరుగుతోంది ఇంత వరకు. ఈ లక్షణాలేవీ లేకపోయినా రిపోర్టుల్లో పాజిటివ్ అని వస్తుండేసరికి వైద్యులు ఆందోళన చెందుతున్నారు. వృద్దులపైనే పంజా విసురుతుందనుకున్న కరోనా చిన్న పిల్లలను కూడా టార్గెట్ చేస్తోంది. గత వారం రోజులుగా వెలుగు చూస్తున్న కరోనా మృతుల్లో చిన్నారులు ఎక్కువ సంఖ్యలో ఉండడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఈ క్రమంలో యూరప్, అమెరికా దేశాల డెర్మటాలజిస్టులు టీనేజర్లలో కోవిడ్-19 లక్షణాలు గుర్తించేందుకు ఆయా వ్యక్తుల కాలి బొటనవేళ్లను పరీక్షించాలని పేర్కొన్నారు.

దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఇటలీ డెర్మటాలజిస్టులు కరోనా వైరస్ సోకిన చిన్నారుల పాదాలు, బొటన వేళ్లు వాపులు రావడం గుర్తించామని చెబుతున్నారు. కావునా చిన్న పిల్లల్లో కరోనా సోకిందో లేదో గుర్తించడానికి కోవిడ్ టోస్ టెస్టు (బొటనవేలు పరీక్షించడం) కూడా దోహదపడుతుందని వైద్యులు అంటున్నారు. అమెరికన్ అకాడమీ డెర్మటాలజీ డాక్టర్ల అసోసియేషన్ కూడా వీరి అభిప్రాయంతో ఏకీభవించింది. మరో ముఖ్యవిషయం కరోనా పేషెంట్ల శరీర భాగాల్లో రక్తం గడ్డకడుతుంది. కరోనా బారిన పడ్డ సగం మంది రోగులను పరిశీలిస్తే వారిలో మూత్రపిండ నాళాలు, ఊపిరితిత్తుల్లోని భాగాలు, మెదడులో రక్తం చిక్కబడడం గుర్తించామన్నారు. రక్తం గడ్డకట్టడం వలన అధిక శాతం కరోనా రోగులు మృత్యువాత పడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story