మహరాష్ట్ర మంత్రికి కరోనా పాజిటివ్

మహరాష్ట్ర మంత్రికి కరోనా పాజిటివ్
X

మంత్రులు, రాజకీయ నాయకులు కరోనాను కట్టడి చేసే చర్యల్లో భాగంగా వివిధ సందర్భాల్లో అధికారులతో, కొందరు వ్యక్తులతో ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఆ విధంగా కూడా మంత్రులు, నాయకులు కోవిడ్ బారిన పడిన సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నా వైరస్ లక్షణాలు బయట పడకపోవడంతో.. ఏ ఒక్కరికి వ్యాధి సోకినా అక్కడ అతడిని కలిసిన వ్యక్తులందరికీ వచ్చేస్తుంది. తాజాగా మహారాష్ట్ర హౌసింగ్ మంత్రి జితేంద్ర అవద్‌కు కోవిడ్ టెస్ట్ చేయగా పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆయన తన కుటుంబ సభ్యులతో 10 రోజుల నుంచి గృహనిర్భంధంలో ఉన్నారు. మంత్రి ముంబౌలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. భద్రతా సిబ్బందిలో ఒకరికి పాజిటివ్ రావడంతో ముందు జాగ్రత్త చర్యగా మత్రిని పరిక్షించడంతో పాజిటివ్ అని తేలింది. దీంతో మంత్రిని కలిసిన వారందరినీ అన్వేషించే పనిలో పడ్డారు అధికారులు.

Next Story

RELATED STORIES