5 రోజుల్లో 7 వేలకు పైగా వైరస్ కేసులు నమోదు

5 రోజుల్లో  7 వేలకు పైగా వైరస్ కేసులు నమోదు
X

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. గత వారం వరకూ వెయ్యిలోపే కేసులు నమోదు అయ్యాయి. అయితే గత 5 రోజుల్లో, దేశంలో కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య ఏకంగా 7 వేలకు పైగా పెరిగింది. గురువారం 1667 మంది వైరస్ భారిన పడ్డారు. దేశంలో ఇదే అత్యధిక రోజూవారీ సంఖ్య. ఏప్రిల్ 19న1580 మంది సోకినట్లు గుర్తించారు. ఏప్రిల్ 18 వరకూ దేశంలో 15,724 మంది కోవిడ్ రోగులు ఉంటే.. అప్పటి నుండి గురువారం వరకు 7,315 మంది అదనంగా యాడ్ అయ్యారు.

5 రోజుల పెరుగుదల 46.52% గా ఉంది. ఈ గణాంకాలు covid19india.org , రాష్ట్ర ప్రభుత్వాల సమాచారం ప్రకారం ఉన్నాయి. అయితే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, మాత్రం దేశంలో మొత్తం 21,700 కరోనా సంక్రమణ కేసులు ఉన్నాయి.. వీరిలో 4324 మంది నయం చేయగా, 686 మంది మరణించారు. దాంతో ప్రస్తుతం 16,689 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

Next Story

RELATED STORIES