మహారాష్ట్రలో తగ్గుతోన్న కరోనా కేసులు..

మహారాష్ట్రలో తగ్గుతోన్న కరోనా కేసులు..
X

మహారాష్ట్రలో కరోనా ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. అయితే ఇవాళ నమోదైన కేసులు గతంతో పోల్చుకుంటే తక్కువే అని అర్ధం చేసుకోవచ్చు. తాజాగా మహారాష్ట్రలో 387 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.. వైద్య ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ఇవి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనావైరస్ కేసులు 6,817 గా ఉన్నాయి. అందులో ముంబైలోనే 3,000 కి పైగా కరోనావైరస్ కేసులు ఉన్నాయి, ఇది దేశంలో అత్యంత ప్రభావితమైన మహానగరం. ఇక నిన్నటివరకూ వ్యాధి సోకిన వారిలో 840 మంది కోలుకున్నారు.. అలాగే ఇప్పటివరకూ మొత్తం 301 మంది మరణించారు.

ఇదిలావుంటే గత 24 గంటల్లో భారతదేశంలో 1,429 కరోనావైరస్ కేసులు నమోదు అయ్యాయి, అంతకుముందు రోజు నుండి ఈ సంఖ్య 1,684 ఉంది. ఇక దేశంలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 24,506 కు చేరుకుంది. కొరోనావైరస్ గత 24 గంటల్లో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మరణించిన వారి సంఖ్య 775 కు చేరుకుంది. మహమ్మారి వ్యాప్తి చెందిన తరువాత ఒకే రోజులో ఇదే అత్యధిక సంఖ్య.

Next Story

RELATED STORIES