వికేంద్రీకరణ బిల్లులు ఆమోదం పొందే వరకూ.. రాజధాని తరలించం: ప్రభుత్వం

రాజధాని వికేంద్రీకరణ బిల్లులు ఆమోదం పొందే వరకూ.. రాజధాని ప్రక్రియ చేపట్టబోమని హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది. రాజధాని తరలింపుపై జేఏసీ హైకోర్టులో వేసిన పిల్ ఈ రోజు విచారణకు వచ్చింది. ప్రభుత్వం రాజధానిని విశాఖకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని.. పిటిషన్ తరపు న్యాయవాది వాదించారు. దీనిపై స్పందించిన న్యాయవాది రాజధాని వికేంద్రీకరణకు ఉద్దేశించిన బిల్లులు ఆమోదం కాకుండా తరలింపు ప్రక్రియ చేపట్టబోమని న్యాయస్థానానికి చెప్పారు. ఇదే అంశంపై ప్రమాణపత్రం కూడా దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఇందుకోసం పదిరోజుల సమయాన్ని కూడా ఇచ్చింది. అయితే రాజధాని తరలింపును ఆపడం ఎవరితరం కాదని ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం దృష్టికి పిటిషనర్ తీసుకువచ్చారు. దీంతో పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాలని ఏజీకి కోర్టు సూచించింది. రాజధాని తరలింపుపై ఎలాంటి చర్యలు తీసుకున్న ధర్మాసనం దృష్టికి తీసుకురావాలని పిటిషనర్లకు హైకోర్టు సూచించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com