జర్మనీలో లక్షా యాభైవేలు దాటిన కరోనా కేసులు

X
TV5 Telugu24 April 2020 11:29 PM GMT
ప్రంపచ దేశాలను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. ఈ ప్రాణాంతకర వైరస్ జర్మనీపై పంజా విసిరింది. దేశంలో ఈ మహమ్మారి అల్లకొల్లాలం సృష్టిస్తోంది. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి పకడ్బందీ చర్యలు చేపట్టినా కొత్తగా వైరస్ సోకుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. తాజాగా జర్మనీలో కరోనా కేసుల సంఖ్య లక్షా యాభైవేలు దాటాయి. శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 2,337 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 150,383కు పెరిగింది. గడచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 227 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,321కు చేరింది.
Next Story