దేశంలో 24 వేలు దాటిన పాజిటివ్ కేసులు

దేశంలో 24 వేలు దాటిన పాజిటివ్ కేసులు

గత నెలరోజులుగా దేశంలో లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. తాజాగా మరోసారి కేసులు పెరిగాయి. దీంతో పాజిటివ్ రోగుల సంఖ్య 24 వేల 540 కు పెరిగింది. ఈ రోజు, కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో 61 , పశ్చిమ బెంగాల్‌లో 57, రాజస్థాన్‌లో 34, బీహార్‌లో 2 మంది రోగులకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. శుక్రవారం 1408 ఇన్ఫెక్షన్లు పెరిగాయి. ఈ గణాంకాలు covid19india.org , రాష్ట్ర ప్రభుత్వాల సమాచారం ప్రకారం ఉన్నాయి.

ఇక కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో మొత్తం సోకిన వారి సంఖ్య 24 వేల 506 గా ఉంది.. వీరిలో 5062 మందికి పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జ్ అయ్యారు. రికవరీ రేటు 20.57 శాతానికి పెరిగిందని ప్రభుత్వం చెబుతోంది. 775 మంది మరణించారు. దాంతో 18 వేల 668 మంది ప్రస్తుతం వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story