బంగారానికి భారీ డిమాండ్.. 10 గ్రాముల ధర..

బంగారానికి భారీ డిమాండ్.. 10 గ్రాముల ధర..

బంగారం అంటే భారతీయులకు చాలా మోజు. ఒక విధంగా పెట్టుబడిగా కూడా బంగారం పనికొస్తుంది. కోవిడ్ కారణంగా బంగారం కొనుగోలు దారులు కరువయ్యారు. అయినా ఈ ఏడాది చివరి నాటికి గ్రాము ధర రూ.5000 కంటే మించిపోవచ్చని నిపుణుల అంచనా. బంగారం ప్రియులకు ఇష్టమైన పండుగ అక్షయ తృతియ. ఆపేరుతో చిన్నమెత్తు బంగారం అయినా కొంటారు. లాక్‌డౌన్ కారణంగా ఆభరణాలు, నాణేలు, బిస్కట్లు వంటివి కొనే పరిస్థితి లేదు. కానీ బంగారం మీద పెట్టుబడికి డిమాండ్ బాగానే ఉంది.

సాంకేతికంగా చూస్తే ధరలో హెచ్చు తగ్గులు అధికంగా చోటు చేసుకునే అవకాశం ఉంది. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల ధర 44 వేలకంటే పెరిగే అవకాశమే ఉంది. భవిష్యత్తులో రూ.48,550 పలికినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి కారణంగా ఎంతో మంది ఇతర పెట్టుబడులను తగ్గిచి బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా చూస్తే ఈ ఏడాది చివరి నాటికి 10 గ్రాముల ధర రూ.52,000 పలికే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story