హైపర్ ఆది క్లారిటీ.. వర్షిణీతో ఎఫైర్.. వచ్చే ఏడాది పెళ్లి!!

హైపర్ ఆది క్లారిటీ.. వర్షిణీతో ఎఫైర్.. వచ్చే ఏడాది పెళ్లి!!
X

బుల్లి తెర కామెడీ షో జబర్‌దస్త్ ద్వారా పాపులర్ అయిన ఆది పంచులు కడుపబ్బ నవ్విస్తుంటాయి. ఎవరినీ వదిలి పెట్టకుండా అందరిమీదా సరదాగా సెటైర్లు వేస్తుంటాడు. ఇప్పడు ఢీ డ్యాన్స్‌షోలో కూడా కనిపిస్తున్నాడు. ఈ షోలో రష్మీ, సుధీర్‌లతో పాటు ఆది వర్షీణీలు కూడా ఉంటారు. మరి షోలో భాగంగా ఒకరితో ఒకరు కలిసి పని చేయాల్సి ఉంటుంది. అది మరీ శృతి మించినట్టుగా కనిపించిందేమో ప్రేక్షకులకి వారిద్దరి మధ్యా ఎఫైర్ నడుస్తుందని రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే వాటన్నిటికీ చెక్ పెడుతూ ఆది.. తాను ప్రకాశం జిల్లాకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నానని.. వచ్చే ఏడాదిలో పెళ్లి ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అమ్మానాన్న చూసిన అమ్మాయినే చేసుకుంటున్నానని హైపర్ ఆది క్లారిటీ ఇచ్చాడు. బుల్లి తెర నుంచి వెండి తెర మీదకు వచ్చి అక్కడ కూడా తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నాడు.

Next Story

RELATED STORIES