coronavirus : కేరళలో 73.5 శాతం రికవరీ రేటు

coronavirus  : కేరళలో 73.5 శాతం రికవరీ రేటు

భారత్ లో మొట్టమొదట కరోనా భారిన పడిన రాష్ట్రం కేరళ. ఇక్కడ వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందిందో.. అంతే వేగంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కేసులు నిలకడగా ఉన్నాయి. ఈరోజు కేరళ రాష్ట్రవ్యాప్తంగా 2 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.. ఈ విషయాన్నీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలలో పేర్కొంది. ప్రస్తుతం కరోనావైరస్ కేసుల సంఖ్య 450 కి చేరింది. ఇందులో ఎక్కువగా కాసర్గోడ్‌లో 170 కోవిడ్ -19 కేసులు ఉన్నాయి. భారత్ దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈ రాష్ట్రంలో అత్యధికంగా రికవరీ రేటు ఉంది.

వైరస్ భారిన పడిన 450 మందిలో 331 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.. దాంతో మొత్తం కేసులతో పోల్చితే రికవరీ రేటు 73.5 శాతంగా ఉంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా కరోనా కారణంగా కేవలం ముగ్గురు మాత్రమే మరణించారు.. ఇలా చూసుకున్నా 0.6 శాతమే.. ఎలా చూసినా కేరళ రాష్ట్రం కరోనాను ఎదుర్కోవడంలో దేశంలోని రాష్ట్రాలకంటే టాప్ ప్లేస్ లో ఉంది. కాగా ఇక్కడ మరణించేసిన ముగ్గురిలో కూడా ఇద్దరికి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. 450 కేసులతో భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల కేసుల సంఖ్యను బట్టి 13 వ స్థానంలో ఉంది కేరళ.

Tags

Read MoreRead Less
Next Story