యూపీ ప్రజలు జూన్ 30 వరకు..

యూపీ ప్రజలు జూన్ 30 వరకు..
X

కరోనాని కట్టడి చేయాలంటే ముగ్గురు, నలుగురు కలవకూడదు.. ముచ్చట్లు పెట్టకూడదు. శుభ్రత పాటించాలి, మాస్కులు కట్టుకోవాలి. అన్నిటి కంటే ముఖ్యంగా జనాలంతా ఒకేచోట గుంపుగా ఉంటే వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదుకే సామాజిక దూరం కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం నొక్కి వక్కాణిస్తోంది. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ట్‌న్ 3తో ముగిసినా ఆ తరువాత రాష్ట్రంలో జనం రాకపోకలు ఎక్కువగా ఉంటాయని భావించిన తరుణంలో ఆ రాష్ట్ర సీఎం యోగీ ఆదిత్యనాథ్.. జూన్ 30 వరకు జనం గుమికూడవద్దని శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైనా ఈ ఉత్తర్వులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. మే3న లాక్డౌన్ ఎత్తి వేస్తే వివిధ ప్రాంతాల్లో వున్న వలస కూలీలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున సీఎం ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

Next Story

RELATED STORIES