భారత సంతతికి అమెరికాలో అరుదైన గౌరవం

భారత సంతతికి చెందిన రేణు ఖాటోర్‌కు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. హ్యూస్టన్ విశ్వవిద్యాలయం ఛాన్స్‌లర్‌గా ఉన్న ఆమె.. ప్రఖ్యాత అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెన్స్‌కు ఎన్నికై చరిత్ర సృష్టించారు. విద్యారంగంలో విశేష కృషి చేసినందుకు గాను ఆమెకు ఈ గౌరవం లభించింది. యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ సిస్టమ్ ఛాన్స్‌లర్‌గా, వర్సిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె ఉత్తర్‌ప్రదేశ్ లో జన్మించారు. ఆ యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌గా ఎన్నికైన మొట్టమొదటి మహిళ గా పైగా ఆమె పేరుగాంచింది. పలు రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులను ఏఏఏఎస్‌కు ఎంపిక చేస్తుంటారు. ఇప్పటి వరకు 250 మంది నోబెల్ బహుమతి గ్రహీతలు, పులిట్జర్ ప్రైజ్ విన్నర్లును ఏఏఏఎస్‌కు ఎంపిక చేశారు. ఈ అకాడమీని 1780లో ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రముఖుల సరసన తనను చేర్చడం పట్ల రేణు ఖాటోర్ సంతోషం వ్యక్తం చేశారు.
RELATED STORIES
Nizamabad: రియల్ ఎస్టేట్ పేరుతో ఘరానా మోసం.. రూ.5 కోట్లతో నిందితుడు...
23 May 2022 4:00 PM GMTRangareddy District: రెండో పెళ్లికి సిద్ధమయిన రైల్వే ఉద్యోగి.. ఇంతలోనే ...
23 May 2022 2:30 PM GMTEluru: ఏలూరులో అధికార పార్టీ దాష్టీకానికి మరో దళితుడు బలి..
23 May 2022 9:45 AM GMTKerala Vismaya Death: వరకట్న వేధింపులకు బలైన డాక్టర్ : దోషిగా రుజువైన...
23 May 2022 9:30 AM GMTRoad Accident: మద్యం మత్తులో యువతుల కారు డ్రైవింగ్.. ఒకరు మృతి
23 May 2022 5:48 AM GMTBengaluru: పాదచారులను ఢీకొన్న కారు.. ఒకరు మృతి.. డ్రైవింగ్ చేసిన...
22 May 2022 11:33 AM GMT