సీఆర్‌పీఎఫ్‌ శిబిరంపై గ్రనేడ్‌ దాడి

సీఆర్‌పీఎఫ్‌ శిబిరంపై గ్రనేడ్‌ దాడి

జమ్మూకాశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) శిబిరంపై

గుర్తుతెలియని ఉగ్రవాదులు శుక్రవారం దాడి చేయడంతో ముగ్గురు సైనికులు గాయపడ్డారు. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. పారామిలిటరీ ఫోర్స్‌కు చెందిన దూనివారి గ్రామంలో ఏర్పాటు చేసిన శిబిరంపై ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరినట్లు పలు ఆంగ్ల వెబ్ సైట్లు పేర్కొన్నాయి. మిలిటెంట్లు శిబిరం వైపు గ్రెనేడ్ విసిరి,

ఆ తరువాత ఆటోమేటిక్ ఆయుధాల నుండి కాల్పులు జరిపారు. గాయపడిన వారిని ఇన్‌స్పెక్టర్ మయేష్ చంద్, కానిస్టేబుల్స్ జి. ప్రకాష్ రావు, కె. సిర్నులుగా గుర్తించినట్లు స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి. గ్రనేడ్‌ దాడితో అప్రమత్తమైన భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. గ్రనేడ్‌ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వారిని పట్టుకునేందుకు భద్రత దళాలు సెర్చ్ మొదలుపెట్టాయి.

Tags

Read MoreRead Less
Next Story