మధ్యప్రదేశ్ లో ట్రైనీ ఐపీఎస్ అధికారికి కరోనా పాజిటివ్

మధ్యప్రదేశ్ లో ట్రైనీ ఐపీఎస్ అధికారికి కరోనా పాజిటివ్

ఆసుపత్రినుంచి తప్పించుకోబోయిన రోగిని పట్టుకున్న ట్రైనీ ఐపిఎస్ ఆఫీసర్ కు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. జబల్‌పూర్ జిల్లాకు చెందిన ట్రైనీ ఐపిఎస్ అధికారి పక్కనే ఉన్న నర్సింగ్‌పూర్ జిల్లాలో COVID-19 కు గురైన ఖైదీని ఆసుపత్రి నుండి తప్పించుకుంటుండగా పట్టుకున్నారు. దాంతో ఈ వైరస్ ఆయనకు కూడా సోకిందని.. ఈ విషయాన్నీ జబల్‌పూర్ జిల్లా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఎంకే మిశ్రా తెలిపారు.

ఏప్రిల్ 7 న ఇండోర్‌లోని చందన్ నగర్ ప్రాంతంలోని ఒక పోలీసుపై రాళ్లు విసిరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 25 ఏళ్ల వ్యక్తి , అతని తండ్రిపై కేసు నమోదైంది. దీంతో వారు జైల్లో ఉన్నారు. అయితే వారిద్దరికి కరోనా సంక్రమించింది. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా ఆ వ్యక్తి ఆసుపత్రినుంచి తప్పించుకున్నాడు. దీంతో ఆ ఐపీఎస్ ఆఫీసర్ అతన్ని పట్టుకున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story