ఆ దేశంలో మళ్ళీ పెరుగుతోన్న పాజిటివ్ కేసులు

ఆ దేశంలో మళ్ళీ పెరుగుతోన్న పాజిటివ్ కేసులు

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే అల్జీరియాలో వ్యాప్తి చెందుతోంది. శనివారం 129 కొత్త కేసులు నమోదయ్యాయి. దీనితో, మొత్తం సోకిన వారి సంఖ్య 3,256 కు పెరిగింది. అలాగే కొత్తగా నాలుగు మరణాలు సంభవించాయి. దాంతో మరణాల సంఖ్య మొత్తం 419 కు పెరిగింది.ఈ సమాచారం 'డిటెక్షన్ అండ్ ఫాలో-అప్ కమిషన్' హెడ్ జిమాల్ ఫోరర్ ఇచ్చింది. అల్జీరియాలో మొదటి కేసు ఫిబ్రవరి 25న నమోదైంది. ఆ తరువాత కేసులు ఊపందుకున్నాయి.

అయితే మధ్యలో తగ్గినట్టే తగ్గిన కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. దీంతో వ్యాప్తిని నివారించడానికి, అల్జీరియన్ ప్రభుత్వం ఏప్రిల్ 29 వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ నిర్వహించింది. మరో మూడు రోజుల్లో లాక్ డౌన్ పూర్తి కానున్న నేపథ్యంలో కేసుల తీవ్రత తగ్గకపోవడంతో లాక్ డౌన్ ను మరో 15 రోజులు పొడిగించాలని యోచిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story