కరోనా కాటు: బ్రెజిల్ పరిస్థితి దారుణం

కరోనా కాటు: బ్రెజిల్ పరిస్థితి దారుణం

లాటిన్ అమెరికాలో అతి పెద్ద దేశమైన బ్రెజిల్ పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న పలు ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోయాయి. ఇంక ఏ ఒక్కరినీ చేర్చుకునే పరిస్థితి లేదంటూ ఆసుపత్రులు చేతులెత్తేస్తున్నాయి. మరోపక్క వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారిసంఖ్య కూడా ఎక్కువగా ఉండడతో శ్మశానవాటికలు, శవాగారాలు కూడా నిండిపోతున్నాయి. ప్రస్తుతం అక్కడ నమోదైన కేసుల సంఖ్య 52,995 కాగా, మృతులు 3600 వరకు ఉన్నారు.

ఓ పక్క పరిస్థితి ఇంత దారుణంగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో తీరు కరోనా అంటే ఎందుకంత భయం అన్నట్లుగా ఉంది. మహమ్మారిని ఎదుర్కోవడానికి మస్ట్‌గా చేయాల్సింది సామాజిక దూరం పాటించాలి అంటే, ఆయన మాత్రం అదేం అవసరం లేదంటూ, బాధితుల్ని మాత్రమే ఐసోలేట్ చేస్తున్నారు. ఇక అమెజాన్ రాష్ట్రంలో కూడా పరిస్థితి ఘోరంగా ఉంది. కరోనా మృతుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో సామూహిక ఖననాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. గురువారం ఒక్కరోజే అమోజాన్‌లో 3700 కొత్త కేసులు నమోదు కాగా, 400 మంది మరణించారని అధికారులు స్పష్టం చేశారు. కాగా, బ్రెజిల్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలు తక్కువగా నిర్వహించడంతో అక్కడ వైరస్ సోకిన వారి సంఖ్య మరింత ఎక్కువే ఉంటుందని నిపుణులు అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story