వరంగల్‌లో బాలుడికి కరోనా

X
By - TV5 Telugu |26 April 2020 3:30 AM IST
తెలంగాణలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ కరోనా మహమ్మారి వరంగల్ జిల్లాలోకి కూడా వ్యాపిస్తోంది. తాజాగా జిల్లాలో ఓ బాలుడికి కరోనా సోకింది. వేలేరు మండలంలో 13 ఏళ్ల బాలుడికి పాజిటివ్ వచ్చింది. దీంతో బాలుడిని మెరుగైన వైద్యం కోసం గాంధీ హాస్పిటల్ కి తరలించామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెల్లడించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com