యూపీలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

యూపీలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
X

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందటం కలకలం సృష్టిస్తోంది. ల‌క్నో నగ‌రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్య‌క్తులు ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. శ్రీన‌గ‌ర్‌కాల‌నీలోని ఇతాహ్ ఏరియాలో శ‌నివారం ఉద‌యం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. మృతులు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఆరోగ్య‌శాఖ‌లో క్లర్క్‌గా పనిచేసి రిటైరైన రాజేశ్వర్ పచౌరీ అత‌ని కుటుంబ‌స‌భ్యులుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాల పక్కన టాయిలట్ క్లీనర్‌తో పాటు విషం కూడా లభించిందని పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు తెలిపారు.

Next Story

RELATED STORIES