మహారాష్ట్రలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు.. ఒకేరోజు 811 మందికి పాజిటివ్

మహారాష్ట్రలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ఇక్కడ రెండురోజుల కిందట మహమ్మారి వ్యాప్తి తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుతోంది. శనివారం 811 మందికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. ఇది ఒకే రోజులో నమోదైన పాజిటివ్ కేసులలో అత్యధిక సంఖ్య. ఏప్రిల్ 23 న రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 778 మందికి కరోనా సోకింది. అయితే ఈ సంఖ్య శుక్రవారం 394 కు పడిపోయింది. దాంతో వ్యాప్తి తగ్గుతోందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.. ఈ తరుణంలో శనివారం ఏకంగా 811 మందికి పాజిటివ్ అని రావడం రాష్ట్ర ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,628 కు చేరుకుంది. అలాగే ఒకేరోజు 22 మంది మరణించారు. దీంతో కోవిడ్ -19 మరణాల సంఖ్య 323 కు పెరిగింది. ఇక మొత్తం 7,628 పాజిటివ్ కేసులలో 5,049 ముంబైలోనే నమోదయ్యాయి. 323 మంది మరణించిన వారిలో 191 మంది కూడా ముంబైలోనే ఉన్నారు. శనివారం 119 మంది రోగులను డిశ్చార్జ్ చేసినట్లు ఆరోగ్య శాఖ ప్రకటన తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,076 మంది రోగులు ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారని స్పష్టం చేసింది.

Next Story

RELATED STORIES