పాకిస్తాన్‌లో కరోనా వ్యాప్తికి కారణం..

పాకిస్తాన్‌లో కరోనా వ్యాప్తికి కారణం..

కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రజల సహకారం కూడా ఉంటేనే వ్యాధి నిర్మూలన సాధ్యమవుతుందని పాకిస్తాన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఇప్తికార్ బర్నీ అంటున్నారు. ముఖ్యంగా మసీదులే కరోనా హాట్‌స్పాట్లుగా మారుతున్నాయని ఆయన అంటున్నారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులంతా ఇళ్లలోనే ప్రార్ధనలు చేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో మసీదులకు వెళ్లవద్దని ఆయన కోరుతున్నారు. పాకిస్తాన్‌లో కరోనా కేసుల సంఖ్య ఇంతకు ముందు నెలలో 6వేల కేసులు నమోదైతే, ఈ ఆరు రోజుల్లో 12 వేలకు చేరిందని అన్నారు. ఈ సంఖ్య ఇలాగే కొనసాగితే వచ్చే రెండు నెలల్లో పరిస్థితి ఊహించడానికే కష్టంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పాకిస్తాన్ రాష్ట్రపతి ఆరీఫ్ ఆల్వీకి ఓ లేఖ రాశారు. 50 ఏళ్ల పై బడిన వారిని ఎట్టి పరిస్థితిలోనూ మసీదులోకి అనుమతించరాదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story