కరోనా కారణంగా మృతిచెందిన కాంగ్రెస్ నేత

గుజరాత్‌లో, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మాజీ ప్రతిపక్ష నాయకుడు బద్రుద్దీన్ షేక్ కరోనా సంక్రమణతో మరణించారు. ఈ విషయాన్నీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శక్తి సింగ్ గోహిల్ తెలియజేశారు. తనకు బద్రుద్దీన్ షేక్ 40 ఏళ్లుగా తెలుసునని, అప్పుడు యూత్ కాంగ్రెస్‌లో ఉండేవాడని ఆయన అన్నారు. ఆయన అహ్మదాబాద్ లోని డానిలిమాడా ప్రాంతానికి చెందిన కౌన్సిలర్ గా పనిచేశారని..
ఆ సమాయంలో ప్రతిపక్ష నాయకుడిగా వున్నారని అన్నారు. అంతేకాదు గుజరాత్ విశ్వవిద్యాలయ సిండికేట్ సభ్యుడిగా , 2000 నుండి 2003 వరకు AMC స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఆయన పనిచేశారు. ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో కరోనా-పాజిటివ్ సోకడంతో. ఈ ప్రాంతాన్ని హాట్ స్పాట్ గా గుర్తించారు. ఇదిలావుంటే గుజరాత్ లో ఇప్పటివరకూ 3,071 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 133 మంది మరణించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com