డిహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్లను అదుపులోకి తీసుకున్న సీబీఐ

డిహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్లను అదుపులోకి తీసుకున్న సీబీఐ

యస్ బ్యాంక్ సంక్షోభం కేసుకు సంబంధించి డిహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్లు కపిల్ వధవన్, ధీరజ్ వధవన్‌లను సిబిఐ అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. మహాబలేశ్వర్‌లో వారి ఫామ్ హౌస్ లో 14 రోజులపాటు క్వారంటైన్ లో ఉన్నారు.. సీబీఐ విచారణకు హాజరుకాకపోవడంతో అరెస్ట్ చేసింది సీబీఐ. యస్ బ్యాంకు కేసులో వధవన్ సోదరులను కేంద్ర బ్యూరో అదుపులోకి తీసుకుని ముంబైకి తీసుకెళ్లినట్లు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఆదివారం తెలిపారు.

డిహెచ్‌ఎఫ్‌ఎల్‌కు ఇచ్చిన రుణాలకు సంబంధించి సిబిఐ మార్చి 7 న యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా కపూర్ , వధవన్‌ సోదరులపై కేసు నమోదు చేసింది సీబీఐ, ఇందులో కపూర్ కుటుంబ క్విడ్ ప్రో కో కు పాల్పడినట్టు అనుమానిస్తోంది. అయితే ఈ కేసులో విచారణకు రావాలని సీబీఐ అధికారులు వదవన్ సోదరులకు పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ హాజరుకాకపోవడంతో వారిని అదుపులోకి తీసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story