భారత్ లో 27,000 మార్కును దాటిన కరోనా కేసులు

భారత్ లో 27,000 మార్కును దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనావైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. 27,000 మార్కును దాటాయి, గత 24 గంటల్లో దేశంలో దాదాపు 1,400 కేసులు నమోదయ్యాయి, అలాగే 24 గంటల్లో 48 మరణాలు సంభవించాయి. దీంతో కోవిడ్ -19 మరణాల సంఖ్య 872 కి చేరుకుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, సోమవారం ఉదయం నాటికి భారతదేశంలో 20,835 క్రియాశీల కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 8,000 ను దాటింది. భారతదేశంలో అత్యధికంగా కోవిడ్ -19 కేసులు మహారాష్ట్రలో 8,068 కాగా, 342 మరణాలు నమోదయ్యాయి.

మహారాష్ట్ర తరువాత గుజరాత్ లో 3 వేలకు పైగా కరోనావైరస్ కేసులను నమోదు చేసింది. గుజరాత్లో మరణించిన వారి సంఖ్య 151 కు చేరుకుంది. ఆ తరువాత ఢిల్లీ 2,918, రాజస్థాన్ 2185, మధ్యప్రదేశ్ 2,096 , తమిళనాడులో 1,885, ఆంధ్రప్రదేశ్‌లో 1177, తెలంగాణలో 1,002 కేసులు పెరిగాయి. పశ్చిమ బెంగాల్‌లో 649, కర్ణాటకలో 503, జమ్మూ కాశ్మీర్‌లో 523, కేరళలో 458, పంజాబ్‌లో 313, హర్యానాలో 289 కేసుల సంఖ్య పెరిగింది. బీహార్‌లో 274 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story