జమ్మూ కాశ్మీర్‌లో మరో నలుగురు ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌

జమ్మూ కాశ్మీర్‌లో మరో నలుగురు ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌
X

జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఆదివారం భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందగా, ఆర్మీ అధికారి గాయపడ్డారు. కుల్గాం జిల్లాలోని గద్దర్ గ్రామంలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. "ఆపరేషన్లో ఒక ఆర్మీ అధికారికి గాయాలయ్యాయి. అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మరణించేసిన ఉగ్రవాదుల యొక్క ఖచ్చితమైన గుర్తింపులు నిర్ధారించబడుతున్నాయని.. వారిలో ఒకరు స్థానికంగా గుర్తించబడ్డారు" అని పోలీసులు తెలిపారు.

కుల్గం జిల్లాలోని గద్దర్ గ్రామంలో ఉగ్రవాదుల జాడ గురించి నిర్దిష్ట సమాచారం వచ్చిన తరువాత, రాష్ట్రీయ రైఫిల్స్ (ఆర్ఆర్), స్థానిక పోలీసుల ప్రత్యేక ఆపరేషన్ గ్రూప్ (ఎస్ఓజి) ,సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) తో సహా భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. మొదట ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు.. ఆ తరువాత భారత దళాలు ఎన్‌కౌంటర్ ప్రారంభించాయని. తెలిపారు. కాగా ఇంకా శోధనలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.

Next Story

RELATED STORIES