ఆన్లైన్ గేమ్.. ఎప్పుడూ ఆవిడే గెలుస్తుందని భర్త..

ఆన్లైన్ గేమ్.. ఎప్పుడూ ఆవిడే గెలుస్తుందని భర్త..
X

24 గంటలు కూడా సరిపోని బిజీ పర్సన్‌ని సైతం ఇంట్లో కూర్చోబెట్టింది కరోనా.. అయ్యో అప్పుడేంటి అంత బిజీ.. ఇప్పుడేంటి ఇంత ఖాళీ అని గరిటె పడుతున్న మగ మహారాజులు కొందరైతే.. ఆన్‌లైన్‌లో గేమ్‌లు ఆడుతూ మరికొందరు.. ఏవో వ్యాపకాలు కల్పించుకుని ఇంకొందరు కాలక్షేపం చేస్తున్నారు. గుజరాత్ వడోదరకు చెందిన భార్యా భర్తలు ఆన్‌లైన్‌లో లూడో గేమ్ ఆడుకుంటున్నారు.

ఎప్పుడూ భార్యే గెలుస్తుంది. ఒక్కసారి కూడా భర్త గెలవలేకపోతున్నాడు. దాంతో అతడికి చిర్రెత్తుకొచ్చింది. గేమ్ ఆడనని ఫోన్ నేలకేసి కొట్టినా బాగానే ఉండేది. కానీ కోపంతో ఊగిపోయిన అతడు భార్య నడుం విరగ్గొట్టాడు. కోపంలో తానేం చేశానో తెలుసుకున్న మరుక్షణం భార్యను తీసుకుని దగ్గరలోని ఆసుపత్రికి పరిగెట్టాడు. ఆమెను పరిక్షించిన వైద్యులు వెన్నెముక విరిగిందని చెప్పారు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. భర్తను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. భర్త క్షమాపణలు కోరడంతో ఆమె కేసు విత్ డ్రా చేసుకుంది.

Next Story

RELATED STORIES