కొత్త జంటకు కరోనా..

కొత్త జంటకు కరోనా..
X

పెళ్లి చేసుకుని నెల రోజులైంది.. ఇంకా అత్తారింట్లోనే బావుండదని ఎలాగైనా వెళ్దామని ఊరెళ్లాలని బయల్దేరారు కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. లాక్‌డౌన్ వేళ ప్రయాణం చేయడమే కాకుండా కరోనా టెస్ట్ కూడా చేయించుకోకుండా రాష్ట్రం దాటుతారా అని పోలీసులు వారిద్దరినీ తీసుకెళ్లి కరోనా టెస్ట్ చేయించారు. రిపోర్ట్‌లో ఇద్దరికీ పాజిటివ్ అని వచ్చింది. రాజస్తాన్‌కు చెందిన యువకుడు ఉత్తరప్రదేశ్‌లోని చత్తర్‌పూర్‌కు చెందిన యువతిని మార్చి 23న వివాహం చేసుకున్నాడు. ఆ తరువాతి రోజు నుంచి దేశం మొత్తం లాక్‌డౌన్ కొనసాగుతోంది. దీంతో ఇన్ని రోజులుగా అదే గ్రామంలో ఉన్న పెళ్లి వారు ఏప్రిల్ 14న రాజస్థాన్‌కు పయనమయ్యారు. నాలుగు రోజుల ప్రయాణం అనంతరం రాజస్థాన్ సరిహద్దులకు చేరుకున్నారు. సరిహద్దు సిబ్బంది వారిని అడ్డుకుని కరోనా టెస్ట్‌లు చేయించారు. పాజిటివ్ అని రావడంతో షాక్ తిన్న పోలీసులు వెంటనే పెళ్లి జరిగిన చత్తర్ పూర్ గ్రామాన్ని మూసివేశారు. కుటుంబీకులందరినీ క్వారంటైన్‌కు తరలించారు. గ్రామస్తులకు స్క్రీనింగ్ చేయడంతో పాటు ఆ ప్రాంతమంతా శానిటైజ్ చేస్తున్నారు.

Next Story

RELATED STORIES