ప్రణీత పెద్ద మనసు.. 21 రోజుల నుంచి పేదలకోసం..

ప్రణీత పెద్ద మనసు.. 21 రోజుల నుంచి పేదలకోసం..
X

చిన్న సహాయం.. పెద్ద ప్రచారం.. కోరుకుంటున్న ప్రస్తుత సమయంలో ప్రచారానికి దూరంగా తనపనేదో తాను చేసుకుపోతోంది సినీ నటి ప్రణీత. అత్తారింటికి దారేది సినిమాలో నటించిన ప్రణీత అభిమానుల మనసు దోచుకుంది. ఇప్పుడు తాను చేస్తున్న పనికి నెటజన్ల నుంచి ప్రశంసలందుకుంటోంది. లాక్‌డౌన్ కారణంగా పని కోల్పోయిన పేదలకు తనవంతు సాయమందిస్తోంది.

లాక్‌డౌన్ మొదలైనప్పటినుంచి ఇప్పటి వరకు దాదాపు 75 వేల మందికి భోజనం పెట్టింది. స్వయంగా వండిస్తూ, తానూ వంటలో సాయపడుతూ, వాటిని పంపిణీ చేస్తోంది. పలువురి ప్రశంసలందుకున్న ప్రణీతను నెటిజన్లు ప్రశంసిస్తూ.. సమాజాన్ని మెల్కొల్పాల్సింది మంచి పనులతో కాని, పిల్లో ఛాలెంజ్‌లతో, రియల్ మేన్ ఛాలెంజ్‌లతో కాదు అని అంటున్నారు. నిండు మనసుతో చేసే ఫుడ్ ఛాలెంజ్‌ల వంటివి అన్నార్తుల కడుపునింపుతుందని, సెలబ్రిటీలు ఆ దిశగా ఆలోచిస్తే మంచిదని సూచిస్తున్నారు.

Next Story

RELATED STORIES