Top

చికెన్ దుకాణాల్లో కుళ్లిన మాంసం.. ప్రజల ప్రాణాలతో చెలగాటం

చికెన్ దుకాణాల్లో కుళ్లిన మాంసం.. ప్రజల ప్రాణాలతో చెలగాటం
X

ప్రజలు, పాలకులు అంతా కరోనా గొడవలో ఉంటే.. పట్టించుకునే వాళ్లు ఎవరూ లేరనుకున్నారో ఏమో.. ఇదే అదనుగా భావించి కుళ్లిన మాంసం అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు ప్రబుద్ధులు. మరణించిన కోళ్లను చికెన్ దుకాణాల్లో మాంసంగా విక్రయిస్తున్నారు విజయవాడలోని కొందరు దుకాణదారులు. అసలే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు నగరాన్ని రోడ్ జోన్‌గా ప్రకటించి దానిలో భాగంగానే మాంసం విక్రయాలపై నిషేధం విధించారు.

అయితే శివారు ప్రాంతంలో మాత్రం మాంసం అమ్మకాలు కొనసాగుతున్నాయి. జక్కంపూడి ప్రాంతంలోని ఓ కాలనీకి వెళ్లే దారిలో ఉన్న ఓ చికెన్ షాపులో మున్సిపల్ శాఖ అధికారులు తనిఖీలు జరిపారు. దుకాణంలో కుళ్లిన వాసన వస్తున్న కోళ్లను గుర్తించారు. వెంటనే దుకాణాన్ని సీజ్ చేశారు. రెడ్‌జోన్ కారణంగా నగరంలో మాంసం దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో దుకాణ దారులు ఇలా అక్రమాలకు పాల్పడుతూ కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

Next Story

RELATED STORIES