నర్సు యూనిఫాంలో హాస్పిటల్ సందర్శించిన ముంబై మేయర్

నర్సు యూనిఫాంలో హాస్పిటల్ సందర్శించిన ముంబై మేయర్

ముంబైలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ముంబై మేయర్ కిశోరీ పెడ్నేకర్ నర్సు యూనిఫాంలో హాస్పిటల్ కి వెళ్లి వైద్య సిబ్బందికి ఉత్సాహం కలిగించారు. బృహన్‌‌ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నడుపుతున్న బీవైఎల్ నాయర్ హాస్పిటల్‌కు సోమవారం ఉదయం ఆమె వెళ్లారు. గతంలో నర్సుగా పనిచేసిన పెడ్నేకర్ హాస్పిటల్ సిబ్బందిని కలిసి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఓ మిల్లు కార్మికుని కూతురైన పెడ్నేకర్ నర్సు వృత్తిని వదిలిపెట్టి 1992లో శివసేన మహిళా విభాగంలో చేరారు. రాయిగడ్, సింధుదుర్గ్ జిల్లాల్లో ఆమె శివసేన తరఫున పనిచేశారు. 2002, 2012, 2017లో ఆమె బీఎంసీ కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story