అమెరికాలో గడచిన 24 గంటల్లో కరోనాతో 1303 మంది మృతి

X
TV5 Telugu28 April 2020 10:27 AM GMT
ప్రంపచ దేశాలను గజగజ వణికిస్తోన్న కరోనా మహమ్మారి.. అమెరికాలో విలయతాండవం సృష్టిస్తోంది. అక్కడ రోజు రోజుకి కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 1,303 మంది ప్రాణాలు కోల్పోయినట్లు జాన్స్ హాఫ్‌కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. ఇప్పటి వరకు అమెరికాలో కరోనాతో 56,797 మంది మృతి చెందారు. ఇక ప్రాణాంతకర మహమ్మారి కారణంగా అమెరికా వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 10,10,356కు చేరింది.
Next Story