భారత్ లో కరోనా కట్టడికి ఏడీబీ భారీ ఋణం

కరోనా మహమ్మారి సంక్రమణను ఎదుర్కోవటానికి భారతదేశానికి 1.5 బిలియన్ డాలర్ల (11 వేల కోట్ల రూపాయలు) రుణాన్ని ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) మంగళవారం ఆమోదించింది. ఈ మొత్తాన్ని వ్యాధి నివారణ , ఆర్థికంగా బలహీన వర్గాల సామాజిక భద్రత కోసం ఖర్చు చేయాలనీ భారత్ కు సూచించింది. అంతేకాదు ఇందులో మహిళలకు, ముఖ్యంగా నిరుపేదలకు కూడా సహాయం చేయడానికి కూడా ఉపయోగించాలని సూచించింది.

ఈ సందర్బంగా.. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భారత్‌కు మద్దతు ఇవ్వడానికి తాము ఉన్నామని ఏడీబీ అధ్యక్షుడు మాట్సుగు అసకావా అన్నారు. కాగా దేశంలో ఇప్పటివరకు 29,435 మందికి సోకినప్పటికీ కరోనా సోకగా.. 900 మందికి పైగా మరణించారు. 24 గంటల్లో 684 రికవరీలు నమోదు కావడంతో మొత్తం 6,864 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story