కూరగాయల కొనుగోలు విషయంలో బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

కూరగాయల కొనుగోలు విషయంలో బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం అమ్మకందారుల నుంచి కూరగాయలు కొనవద్దని సూచించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బిజెపి ఎమ్మెల్యే సురేష్ తివారీ డియోరియా జిల్లా ప్రజలను ఉద్ద్యేశించి ఈ విధంగా వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. డియోరియాలోని బర్హాజ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో తబ్లిఘి జమాత్ మార్కాజ్ ఘటనను ఉటంకిస్తూ తివారీ ఈ వ్యాఖ్యలు చేశారు. జమాత్ సభ్యులు దేశానికి ఏమి చేశారో అందరూ చూస్తున్నారని..
అంతేకాదు కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి ఒక సమాజ ప్రజలు లాలాజలంతో కలుషితమైన కూరగాయలను విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయని.. ఇవి విన్న తరువాత, వారి నుండి కూరగాయలు కొనవద్దని సలహా ఇచ్చానన్నారు.. ప్రజలు కూడా తన వ్యాఖ్యలను అనుసరించాలని కోరుకుంటున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు తనకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే చేశానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com