చైనాపై ఆధారపడడం తగ్గించండి: ప్రతినిధుల సూచనలు

చైనాపై ఆధారపడడం తగ్గించండి: ప్రతినిధుల సూచనలు

చైనా విసిరిన పంజా కరోనా.. ఈ వైరస్ థాటికి తట్టుకోలేక ప్రపంచమంతా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తోంది. చైనాను దెబ్బతీయాలంటే ఆ దేశం నుంచి తిగుమతి చేసుకుంటున్న వస్తువులను నిలిపి వేయాలి. డ్రాగన్ దేశంపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని అమెరికా అధ్యక్షుడికి సూచనలు చేస్తున్నారు చట్టసభల ప్రతినిధులు. జరిగిన నష్టాన్ని పూడ్చాలంటే భారీ స్థాయిలో నష్టపరిహారాన్ని వసూలు చేయాలని డిమాండ్ చేశారు.

అమెరికా.. సైనిక ఉత్పత్తుల్లో వాడే అరుదైన మూలకాల కోసం చైనాపై ఆధారపడుతోందని సెనెటర్ టెడ్ క్రూజ్ నేతృత్వంలోని బృందం వివరించింది. ఈ విషయంలో చైనాపై ఎత్త తక్కువ ఆధారపడితే అంత మంచిదని అమెరికా రక్షణ కార్యదర్శి మార్క్ ఎస్సర్ అంటున్నారు. ఇదే సమయంలో చైనాకు కట్టాల్సిన రుణాలను నిలిపివేసి.. కోవిడ్ వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, కరోనా వైరస్‌ని తొలిదశలోనే గుర్తించిన చైనా దాన్ని కట్టడి చేసి ఉంటే ఈ స్థాయిలో నష్టం జరిగేది కాదని ట్రంప్ మొదట్నించి మొత్తుకుంటూనే ఉన్నారు. ఒక దేశం చేసిన తప్పిదానికి 184 దేశాలు బలవుతున్నాయని చైనాపై ట్రంప్ విరుచుకుపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story