RT-PCR టెస్ట్ కిట్‌ల తయారీ ప్రారంభిస్తాం : కేంద్రమంత్రి

RT-PCR టెస్ట్ కిట్‌ల తయారీ ప్రారంభిస్తాం : కేంద్రమంత్రి

భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య దాదాపు 30 వేలకు చేరుకుంది. అంతేకాదు మరణాల సంఖ్య కూడా 900 కు పైగా నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ చెప్పిన వివరాల ప్రకారం.. దేశంలో గత 14 రోజుల్లో రెట్టింపు రేటు 8.7 ఉంటే, అది 7 రోజుల నుండి 10.2 కు పెరిగింది. వివిధ రాష్ట్రాల్లో కేసులు వెయ్యికి పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్,

గుజరాత్ , తమిళనాడు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుతున్నాయి. ఇక ICMR నుండి ఆమోదం పొందిన తరువాత, మే నాటికి RT-PCR , యాంటీబాడీ టెస్ట్ కిట్‌లను తయారు చేయడం ప్రారంభిస్తామని కేంద్రమంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ వెల్లడించారు. మే నుండి ప్రతిరోజూ లక్ష పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story