కరోనా ఎఫెక్ట్.. పెళ్లి పందిట్లో పది మంది కంటే ఎక్కువుంటే..

కరోనా ఎఫెక్ట్.. పెళ్లి పందిట్లో పది మంది కంటే ఎక్కువుంటే..

కరోనా తగ్గితే కళ్యాణం చేసుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్నాయి కొన్ని జంటలు. పెట్టిన ముహుర్తానికే పెళ్లి చేసుకోవాలనుకున్న కొన్ని జంటలు ఇద్దరు ముగ్గురుతో ఆ తంతు కానిచ్చేస్తున్నారు. లాక్‌డౌన్ తరువాత కూడా అదే పరిస్థితి కొనసాగించాలని పదిమంది కంటే పందింట్లో ఎక్కువ మంది ఉండడానికి వీలు లేదని అంటోంది ఏపీ ప్రభుత్వం. ఊరంత పందిరేసి ఊళ్లో వాళ్లందర్నీ పిలిచి భోజనాలు పెడతానంటే కుదరదంటున్నారు అధికారులు.

ఇదే విషయంపై మాట్లాడిన డీఆర్‌వో వెంకటరావు.. పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె తరపున పెళ్లి పందిట్లో పది మందికి మాత్రమే అనుమతి ఉంటుందని అన్నారు. ఈ మేరకు అనుమతిపొందిన వారి వివరాలను రెవెన్యూ అధికారులు సంబంధిత పోలీస్ స్టేషన్‌కు పంపిస్తున్నట్లు తెలిపారు. సామాజిక దూరం పాటించకుండా నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా ఇంకా గ్రీన్‌జోన్‌లోనే ఉన్నందున ఇతర ప్రాంతాల వారితో సంబంధాలు కుదుర్చుకున్న పెళ్లిళ్లకు అనుమతులు నిరాకరిస్తున్నట్లు వెంకటరావు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story