లాలూను కలవర పెడుతున్న 'కరోనా'

లాలూను కలవర పెడుతున్న కరోనా
X

ఒంట్లో కాస్త సుస్తీ చేయడంతో ఆస్పత్రికి వెళ్లిన ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కి కరోనా భయం పట్టుకుంది. మరి ఆయన భయానికి అర్ధం లేకపోలేదు. ఆయన జాయిన్ అయిన్ రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆస్పత్రిలో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. అతడు కూడా అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దానికి తోడు లాలూకి వైద్యం చేసిన డాక్టరే అతడినీ ట్రీట్ చేశాడు పాజిటివ్ అని తెలియకముందు. మరదే లాలూ భయానికి కారణం. దీంతో డాక్టర్‌ని, డాక్టర్ ఫ్యామిలీని, అతడి బృందంలోని వైద్య సిబ్బందిని అందరినీ క్వారంటైన్‌కి పంపుతున్నట్లు రిమ్స్ ప్రకటించింది. ఒకవేళ వారికి ఎవరికైనా కరోనా పాజిటివ్ అని తేలితే లాలూకి కరోనా టెస్ట్ చేస్తామంటున్నారు వైద్యులు. అందాక లాలూ 'కరోనా' టెన్షన్ భరించక తప్పదు.

Next Story

RELATED STORIES