దక్షిణ కాశ్మీర్‌లో కాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదుల ఏరివేత..

దక్షిణ కాశ్మీర్‌లో కాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదుల ఏరివేత..
X

దక్షిణ కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలోని జైన్‌పోరాలో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో మరో ఉగ్రవాది మృతి చెందాడు. వాస్తవానికి మంగళవారం సాయంత్రం ప్రారంభమైన ఎన్‌కౌంటర్ లో ఒక ఉగ్రవాదిని అంతమొందించారు.. అయితే రాత్రి సమయంలో ఆపరేషన్ ఆగింది. అయితే బుధవారం ఉదయం తిరిగి ప్రారంభం కావడంతో మరో ఉగ్రవాదిని అంతమొందించారు.

మొత్తం ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మెల్‌హురా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం రావటంతో భద్రతా దళాలు, పోలీసులు కార్డన్ చెర్చ్ చేపట్టారు. దీంతో ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఎన్‌కౌంటర్‌లో మూడో ఉగ్రవాది కూడా మృతి చెందినట్లు భావిస్తున్నారు, కాని మృతదేహాన్ని ఇంకా వెలికి తీయలేదు. మరోవైపు ఎన్‌కౌంటర్ ఇంకా ముగియలేదని.. కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు.

Next Story

RELATED STORIES