తమిళనాడులో 121 మంది 12 ఏళ్లలోపు పిల్లలకు కరోనా పాజిటివ్

తమిళనాడు ఆరోగ్య శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, ఈ రోజు వరకు రాష్ట్రంలో 12 ఏళ్లలోపు 121 మంది పిల్లలకు కోవిడ్ -19 సోకింది. ఇక ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన మీడియా బులెటిన్‌లో 121 కొత్త కేసులు రాష్ట్రంలో నమోదు అయ్యాయి, దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,058 కు పెరిగింది.

2,058 పాజిటివ్ కేసులలో 1,392 మంది పురుషులు, 666 మంది మహిళా రోగులు ఉన్నారు. 24 గంటల్లో చెన్నైలో 103 కొత్త కేసులు నమోదయ్యాయి, దీంతో నగరంలో సంఖ్య 673 గా ఉంది. ఏప్రిల్ 28 నాటికి తమిళనాడు రాష్ట్రంలో 1,128 కోవిడ్ -19 రోగులు కోలుకున్నారు. వీరిలో 27 మంది గడిచిన 24 గంటల్లో డిశ్చార్జ్ అయ్యారు.

తమిళనాడులోని 30 ప్రభుత్వ , 11 ప్రైవేట్ ల్యాబ్ లలో పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 1,01,874 నమూనాలను తీసుకొని పరీక్ష చేయగా.. ఇందులో 2,058 మందికి పాజిటివ్ రాగా.. 97,908 నమూనాలు నెగెటివ్ గా వచ్చాయి. 1,908 నమూనాల రిజల్ట్ రావాల్సి ఉంది. అలాగే 8,685 నమూనాలు ఆల్రెడీ టెస్టులు చేయించుకున్నవారు ఉండటం విశేషం.

Next Story

RELATED STORIES